సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2022-04-18T17:01:25+05:30 IST
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
అమరావతి: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ప్రతి దళితుడికి అందించే బాధ్యత సీఎం తనకు ఇచ్చారన్నారు. ఎక్కడా చిన్న తప్పు కూడా చేయకుండా పని చేస్తానని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనతో దళిత సంక్షేమానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.