Minister Meyyanathan: చెస్‌ పోటీలతో ప్రపంచం దృష్టిలో రాష్ట్రం

ABN , First Publish Date - 2022-08-18T15:08:33+05:30 IST

చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు విజయవంతంగా నిర్వహించడంతో తమిళనాడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ

Minister Meyyanathan: చెస్‌ పోటీలతో ప్రపంచం దృష్టిలో రాష్ట్రం

                           - క్రీడాభివృద్ధి శాఖ మంత్రి మెయ్యనాథన్‌


చెన్నై, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు విజయవంతంగా నిర్వహించడంతో తమిళనాడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి మెయ్యనాధన్‌(Minister Meyyanathan) పేర్కొన్నారు. తమిళ సంస్కృతీ, సంప్రదాయాలు, ఆతిథ్య విశేషాలను ప్రపంచం మొత్తం తెలుసుకుందన్నారు. గత ఏడాది తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రీడా రంగం అభివృద్ధికి గట్టి ప్రయత్నం చేస్తున్నామని, ముఖ్యమంత్రి విరివిగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఏర్పాటైన దక్షిణ భారత స్కూల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(Cricket Association) నూతన కార్యవర్గం మంగళవారం రాత్రి చెన్నైలో ప్రమాణస్వీకారం చేసింది. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జాన్‌ అమలన్‌, ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్‏కుమార్‌, కార్యదర్శిగా జాషువా ఎడిసన్‌, కోశాధికారిగా అష్ర్‌ఫల చేత మంత్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిభాంతులైన యువతను క్రికెట్‌లో ఉన్నతస్థాయికి తీసుకెళ్లి, జాతీయస్థాయిలో పాల్గొనేలా కృషి చేయాలని నిర్వాహకులకు సూచించారు. 

Updated Date - 2022-08-18T15:08:33+05:30 IST