Minister: మద్యం దుకాణాల మూసివేతకు పరిశీలన

ABN , First Publish Date - 2022-08-12T17:00:19+05:30 IST

రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని టాస్మాక్‌ మద్యం దుకాణాలను దశలవారీగా మూసివేసేందుకు పరిశీలిస్తున్నట్లు గృహవసతి శాఖ మంత్రి

Minister: మద్యం దుకాణాల మూసివేతకు పరిశీలన

                                      - మంత్రి ముత్తుస్వామి


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 11: రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని టాస్మాక్‌ మద్యం దుకాణాలను దశలవారీగా మూసివేసేందుకు పరిశీలిస్తున్నట్లు గృహవసతి శాఖ మంత్రి ఎస్‌.ముత్తుస్వామి(Minister S. Muthuswamy) పేర్కొన్నారు. ఈరోడ్‌ రైల్వే కాలనీ ప్రభుత్వ మహోన్నత పాఠశాల విద్యార్థులు మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ప్రచారాన్ని గురువారం మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 19వ తేది వరకు అన్ని జిల్లాల్లోని పాఠశాలల్లో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ప్రచారం జరుగుతుందని, సుమారు 240 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 60 వేల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేసే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని, మిగతా దుకాణాలు కూడా దశలవారీగా మూసివేసేందుకు పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణన్‌ ఉన్ని(Collector Krishnan Unni), డీఆర్వో సంతోషిణి, మేయర్‌ నాగరత్నం, ఎమ్మెల్యే తిరుమగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T17:00:19+05:30 IST