రూ.9,660 కోట్లతో కావేరి సంయుక్త తాగునీటి పథకం

ABN , First Publish Date - 2022-04-21T14:30:54+05:30 IST

తిరువణ్ణామలై, వేలూరు సహా పలు జిల్లాల ప్రజలు, రైతులు లబ్దిపొందేలా రూ.9,660 కోట్లతో కావేరి సంయుక్త తాగునీటి పథకాన్ని అమలుపరచనున్నట్లు నగరాభివృద్ధి శాఖ

రూ.9,660 కోట్లతో కావేరి సంయుక్త తాగునీటి పథకం

                                - మంత్రి కేఎన్‌ నెహ్రూ


ప్యారీస్‌(చెన్నై): తిరువణ్ణామలై, వేలూరు సహా పలు జిల్లాల ప్రజలు, రైతులు లబ్దిపొందేలా రూ.9,660 కోట్లతో కావేరి సంయుక్త తాగునీటి పథకాన్ని అమలుపరచనున్నట్లు నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ ప్రకటించారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో  కీల్‌పెన్నాతూర్‌ నియోజకవర్గం వెట్టవనం పంచాయతీలో లక్ష లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందా? అని డిప్యూటీ స్పీకర్‌ పిచ్ఛాండి ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానం చెబుతూ, నిధుల లేమి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికి నోచుకోని పంచాయతీల వివరాలను సేకరిస్తున్నామని, తొలివిడతగా 400 పంచాయతీలను ఎంపిక చేసి తాగునీటి అవసరాలు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. కావేరి సంయుక్త తాగునీటి పథకం ప్రణాళిక పరిశీలించి, తిరువణ్ణామలై, వేలూరు సహా పలు జిల్లాల ప్రజలు లబ్దిపొందేలా మెగా తాగునీటి పథకాన్ని ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే అమలుపరచనున్నట్లు మంత్రి నెహ్రూ తెలిపారు.

Updated Date - 2022-04-21T14:30:54+05:30 IST