దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలి:మంత్రి Niranjan reddy

ABN , First Publish Date - 2022-06-15T22:50:41+05:30 IST

దేశ వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రీకరణ, సాంకేతికతను సంపూర్ణంగా అమలు చెయ్యాలని తద్వారా రైతుల ప్రయోజనాలుకాపాడేందుకు వీలుంటుందని వ్యవసాయ శాఖ(agri culture) మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) అన్నారు

దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలి:మంత్రి Niranjan reddy

హైదరాబాద్: దేశ వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రీకరణ, సాంకేతికతను సంపూర్ణంగా అమలు చెయ్యాలని తద్వారా రైతుల ప్రయోజనాలుకాపాడేందుకు వీలుంటుందని వ్యవసాయ శాఖ(agri culture) మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) అన్నారు.వ్యవసాయ, ఉద్యాన రంగాలలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికతతో యువతకు ఉపాధి లభించాలని అన్నారు. దీనిమూలంగా వ్యవసాయరంగంలో యాంత్రీకరణ అందుబాటులోకి రావడమే కాకుండా, రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిడోరియంలో నిర్వహించిన “అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సు”లో మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగులో నూతన శకానికి నాంది పలికాం, సాంప్రదాయ సాగునుండి ప్రపంచ సాంకేతికతను తెలంగాణ వ్యవసాయానికి అన్వయించుకోవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని అన్నారు.మనకున్న వ్యవసాయాన్ని ఉజ్వలమైన వ్యవసాయంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.కేవలం అధిక మోతాదులో  పంటలు పండించడమే కాదు. అవసరమైన పంటలు, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు, రైతుకు రాబడినిచ్చే పంటలు పండించాలని నిర్ణయించామన్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించి రాష్ట్ర ఆదాయం, దేశ ఆదాయం పెంచేలా తెలంగాణ వ్యవసాయం ముందుకుసాగాలని కోరారు.


మూడేళ్లుగా రైతులను అప్రమత్తం చేస్తున్నాం.జిల్లాల వారీగా సదస్సులతో ఏ పంటలు వేయాలి అన్న విషయాన్ని రైతులకు వివరించాం. రైతులు కూడా పంటల వైవిద్యీకరణకు సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రపంచ అవసరాలకు సరిపడా  పత్తి ఉత్పత్తి కావడం లేదు. ప్రపంచంలో పత్తి అత్యధికంగా సాగయ్యేది భారతదేశంలోనే అని చెప్పారు.3.20 కోట్ల ఎకరాలలో దేశంలో పత్తి సాగు అవుతున్నది. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాలలో తెలంగాణ, గుజరాత్ లు ఉన్నయననారు.ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి  రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-15T22:50:41+05:30 IST