ప్రపంచంలో ప్రధానమైన వాణిజ్య పంట పత్తి: మంత్రి Niranjan reddy

ABN , First Publish Date - 2022-07-06T21:59:27+05:30 IST

ప్రపంచంలోనే ప్రధానపంట పత్తి అని, ప్రపంచ వస్త్రపరిశ్రమకు మూలాధారమైన పత్తి(cotton) ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండోస్ధానంలో వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan reddy) తెలిపారు.

ప్రపంచంలో ప్రధానమైన వాణిజ్య పంట పత్తి: మంత్రి Niranjan reddy

హైదరాబాద్: ప్రపంచంలోనే ప్రధానపంట పత్తి అని, ప్రపంచ వస్త్రపరిశ్రమకు మూలాధారమైన పత్తి(cotton) ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండోస్ధానంలో వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan reddy) తెలిపారు.ప్రపంచంలో పండే నాలుగు రకాల పత్తిపంటలో 90 శాతం పత్తిపంట గాసిపియం హిర్సూటం రకానికి చెందినదని అన్నారు.ప్రపంచంలో అత్యధికంగా భారత్ నుండి సుమారు 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతున్నదని ఆయన తెలిపారు. భారత్ పాటు  చైనా, అమెరికాలలో పత్తి ఎక్కువగా సాగవుతున్నదని వెల్లడించారు.అమెరికాలోని సెయింట్ లూయిస్ లో బేయర్ పత్తి విత్తన పంట, జెన్యూ పరిశోధన కేంద్రాన్ని మంత్రి సందర్శించారు.ఆయనవెంట  ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రవీంద్రనాయక్,  పెద్ది సుదర్శన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తదితరులు ఉన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తితో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నదని తెలిపారు.భారతదేశంతో పాటు ప్రధానంగా దక్కన్ పీఠభూమి ప్రపంచంలోనే పత్తి సాగుకు అత్యంత అనుకూలమైనదిగా పేర్కొన్నారు.6.1 మిలియన్ టన్నుల ఉత్పత్తితో చైనా రెండోస్థానం .. 3.6 మిలియన్ టన్నుల ఉత్పత్తితో అమెరికా మూడో స్థానంలో ఉండగా అమెరికాలో టెక్సాస్, అర్జియా, మిసిసిపి, అర్కాన్ సాస్, అలబామా రాష్ట్రాల్లో పత్తి ప్రధానంగా సాగవుతుందని వివరించారు.2030 నాటికి భారతదేశంలో పత్తి ఉత్పత్తి 7.2 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి వివరించారు.దేశంలో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ లలో పత్తి సాగవుతున్నది. ఆతర్వాత ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి, రెండో స్థానంలో తెలంగాణ ఉన్నాయని అన్నారు. 


2002 నుండి పురుగులను తట్టుకునే బోల్ గార్డ్ రకం హైబ్రీడ్ పత్తి సాగవుతున్నదని దీంతో పంట ఉత్పాదకత పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఒకటవ తరం బోల్ గార్డ్ 1, బోల్ గార్డ్ 2 పత్తి రకాలతో పాటు  బేయర్ సంస్థ మరింత ముందుకు వెళ్లి మూడో రకం అందించిందని, నాలుగో రకం సిద్దంగా ఉన్నదని తెలిపారు.తెలంగాణకు పత్తి, మొక్కజొన్న , కూరగాయల రకాలలో నూతన వంగడాలను అందించిందేందుకు బేయర్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం పత్తి సాగు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-06T21:59:27+05:30 IST