ప్రజల్లో వ్యవసాయ శాఖ గౌరవం పెరిగింది: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-20T20:44:46+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏ్పడిన తర్వాత అధికారి టీఆర్ఎస్ చేపట్టి అనేక పధకాల వల్ల ప్రజల్లో వ్యవసాయశాఖ పట్ల గౌరవం పెరిగిందని ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

ప్రజల్లో వ్యవసాయ శాఖ గౌరవం పెరిగింది: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏ్పడిన తర్వాత అధికారి టీఆర్ఎస్ చేపట్టి అనేక పధకాల వల్ల ప్రజల్లో వ్యవసాయశాఖ పట్ల గౌరవం పెరిగిందని ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది కూడా వ్యవసాయ శాఖనేనని చెప్పారు. ప్రజలతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకున్న శాఖ ఇది.ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, వ్యవసాయరంగం పట్ల ఉన్న మక్కువ, అభిలాష, వ్యవసాయ శాఖ ఉద్యోగుల పనితీరు మూలంగా ప్రజల ఆదరణ పెరిగిందన్నారు. గురువారం ఆయన అబిడ్స్ రెడ్డి హాస్టల్ ఆడిటోరియంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం వ్యవసాయ శాఖను ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖకు గుర్తింపు పెరిగిందన్నారు. ఒక రైతుగా తనకూ ఈ శాఖ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏఈఓలు, ఏఓలు అద్భుతంగా పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. వ్యవసాయ శాఖలో నెలకొన్న ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, త్వరలోనే పదోన్నతులు చేపడతామన్నారు. అదనపు పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీఇచ్చారని తెలిపారు. ఉద్యోగ సంఘాలు ఒక్క తాటి మీదకు రావాలని సూచించారు. 


నిస్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుందాం... అందరికీ మేలు జరిగేలా చూద్దామన్నారు. కరోనా నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో పంటల మార్పిడి కోసం రైతులను పెద్దఎత్తున చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంఘం  చైర్మన్ బి.కృ పాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.కృపాకర్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T20:44:46+05:30 IST