వ్యవసాయంలో తెలంగాణ ఆదర్శం: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-16T22:35:23+05:30 IST

వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

వ్యవసాయంలో తెలంగాణ ఆదర్శం: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తెలంగాణ రైతన్నలు సంతోషంగా వున్నారని అన్నారు. గడచిన ఏడేళ్లలో  తెలంగాణలో ప్రాథమిక రంగం (వ్యవసాయం) సగటు వృద్ది రేటు 15.8 శాతంగా నమోదయింది.  ఇది జాతీయ వృద్ది రేటు 8.5 శాతం కన్నా చాలా ఎక్కువని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాల సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయంలో తెలంగాణ సాధించిన విజయాలపై ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో 60 లక్షల ఎకరాలలో పత్తి ఉత్పత్తి చేస్తూ నంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలించిందన్నారు.అలాగే ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 2స్ధానం, సేకరణలోనూ నెంబర్2గా నిలిచిందన్నారు. 


2014 - 15 నాటికి 24 లక్షల 29 వేల 536 టన్నుల ధాన్యం సేకరణ జరిగేది. 2021 నాటికి అది కోటీ 41 లక్షల 8784 మెట్రిక్ టన్నులు తెలంగాణ రైతుల నుండి సేకరించి ఎఫ్ సీ ఐకి ఇవ్వగలిగామన్నారు. 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 34 లక్షల ఎకరాలు కాగా 2021 నాటికి అది 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగింది .. ఇది కాకుండా ఏటా 11.50 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు పండించినట్టు తెలిపారు. 2014 నాటికి ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నులు మాత్రమే ఉండగా 2021 నాటికి 3 కోట్ల టన్నులకు చేరిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి రూ.97,924 కోట్లతో 556 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. గడచిన ఏడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు. రూ.83 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం ఏడేళ్లలో 28,473 కోట్లు వెచ్చించి వ్యవసాయ విద్యుత్ మౌళిక సదుపాయాలు మెరుగుపరచడం జరిగిందని తెలిపారు. 


ఏటా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ రాష్ట్రంలోని 26 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత కరంటు అందించడం జరుగుతున్నదన్నారు. గత ఎనిమిది విడతలలో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50,448.16 కోట్లు రైతుల ఖాతాలలో జమచేశామన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.17,244 కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాకుండా సీజన్ కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను ముందుగానే తెప్పించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర పద్దతుల  ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతున్నదని తెలిపారు.

Updated Date - 2022-02-16T22:35:23+05:30 IST