దేశాన్ని పంటకాలనీలుగా విభజించాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-03-18T23:10:59+05:30 IST

దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలని, దేశాన్ని పంట కాలనీలుగా విభజించాల్సిన అవసరం వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

దేశాన్ని పంటకాలనీలుగా విభజించాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలని, దేశాన్ని పంట కాలనీలుగా విభజించాల్సిన అవసరం వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.కానీ కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పంట కాలనీలుగా విభజించి పంటల సాగుకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం వుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలనకు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అహ్మద్ నగర్ జిల్లా శిరిడీ సమీపంలో ద్రాక్ష, జామ తోటలను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు.


స్థానిక వ్యవసాయ, ఉద్యాన అధికారులు, రైతులతో సమావేశమై షిరిడీ ప్రాంతంలో వర్షపాతం వివరాలు, పంటల రకాలు, సాగునీటి వసతి, పంటల మార్కెటింగ్ పై రైతులతో ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్టాడుతూ పంటల మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో రైతుకు సాయం చేయాల్సిన కేంద్రం చేటు చేస్తున్నదని విమర్శించారు.భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మళ్లేలా చూడాలి.యువత వ్యవసాయంలో తమదైన ముద్ర వేయాలన్నారు.తెలంగాణలో పంటల వైవిద్యీకరణ కోసం పెద్ద ఎత్తున కృషిచేస్తున్నామని చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు ఇస్తూ వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు.


సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సమూలంగా మారిపోయిందన్నారు.పంటల మార్పిడితో రైతులు లాభాలు గడించాలన్నది మా ఉద్దేశమన్నారు.మహారాష్ట్ర జాల్నా ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటల పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో పంట మార్పిడి కోసం ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పర్యటించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి వెంట ఎమ్మెల్యేలు  బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యానశాఖ జేడి సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-03-18T23:10:59+05:30 IST