ప్రతి గుంటకు సాగునీరు ఇచ్చి తీరుతాం

ABN , First Publish Date - 2020-12-04T04:56:16+05:30 IST

సాగు యోగ్యమైన ప్రతి గుంటకు సాగునీరు అందించి తీరుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

ప్రతి గుంటకు సాగునీరు ఇచ్చి తీరుతాం
జగత్‌పల్లిలో రెండు చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- రూ.6.30 కోట్లతో నాలుగు చెక్‌డ్యాంల నిర్మాణం

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

    పెద్దమందడి/ పెబ్బేరు/ వనపర్తి అర్బన్‌/ శ్రీరంగా పురం/ గోపాల్‌పేట, డిసెంబరు 3 : సాగు యోగ్యమైన ప్రతి గుంటకు సాగునీరు అందించి తీరుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెద్దమందడి మండలంలోని జగత్‌పల్లిలో రెండు చెక్‌డ్యాంలు, వనపర్తి మండలం చిట్యాల శివారులోని పెద్దవాగులో మరో రెండు చెక్‌డ్యాంల నిర్మాణానికి గురువారం ఆయన జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు తీరాయన్నారు. చెక్‌డ్యాంలను నాణ్యతగా నిర్మించడంతో పాటు సకాలంలో పూర్తి చేయాలని ఏజెన్సీ నిర్వహకుడు టి.శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. అనంతరం జగత్‌పల్లి గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందించారు. బలిజపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, బీసీ కమ్యూనిటీ భవనం, ప్రకృతి వనం, వైకుంఠదామం, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఆలయ ఉద్యానవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌ రెడ్డి, జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, జేసీ వేణుగోపాల్‌, సర్పంచ్‌లు అనంత, జయంతి, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు కుమార్‌యాదవ్‌ ఉన్నారు.

- రేవల్లి మండలం చెన్నారంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పాతతండాలో పంచా యతీ భవనానికి భూమిపూజ చేశారు. ప్రకృతి వనా న్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు లు గౌతమి శివరాంరెడ్డి, రమేష్‌, లక్ష్మీ, ఎంపీపీ సేనాపతి, జడ్పీటీసీ భీమయ్య, చెన్నారం మాజీ ఎంపీటీసీ రాజవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. 

- పెబ్బేరు, చెలిమిల్ల గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద బస్‌షెల్టర్‌ను ప్రారంభించారు. జాతీయ స్థాయిలో పశువైద్య పీజీ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన రాగిణిని సన్మానించి, రూ.25వేల ఆర్థిక సహయాన్ని అందించారు. కార్యక్రమంలో జడ్పీ  చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, జేసీ వేణుగోపాల్‌, ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ పద్మ, మునిసిపల్‌ చైర్మన్‌ కరుణశ్రీ, కమిషనర్‌  జాన్‌ కృపాకర్‌, తహసీల్దార్‌ ఘాన్సిరాం, సింగిల్‌విండో చైర్మన్‌ కోదండరాంరెడ్డి, నాయకులు కర్రెస్వామి, బుచ్చారెడ్డి, వనం రాములు, హరిశంకర్‌ నాయుడు, రంగారెడ్డి పాల్గొన్నారు.

- శ్రీరంగాపురంలో రూ.3.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కస్తూర్బా పాఠశాల, హాస్టల్‌ భవనాల కు మంత్రి నిరంజన్‌రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అనంతరం 13 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, జేసీ వేణుగోపాల్‌, అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, గ్రామ సర్పంచ్‌ వినీల రాణి, వైస్‌ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గౌనిబుచ్చారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు జగన్నాథం నాయుడు, మండల రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు గౌడ్‌నాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ శ్యామల, వైస్‌ చైర్మన్‌ నవీన్‌రెడ్డి, నాయకులు పృథ్విరాజ్‌, సర్పంచ్‌లు సత్యంయాదవ్‌, వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

- గోపాల్‌పేట మండలంలోని బుద్దారం, ఏదుట్ల, గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు.  కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యాతిరుపతియాదవ్‌, జెడ్పీటీసీ భార్గవి కోటీశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ పద్మమ్మ, శ్రీలత, ఎంపీడిఓ కరుణశ్రీ, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి, బాల్‌రెడి, మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు, నాయకులు సురేష్‌కుమార్‌, బిల్లకంటిరాజు, విష్టు, శ్రావన్‌కుమార్‌, లచ్చగౌడ్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T04:56:16+05:30 IST