అవినీతికి తావులేకుండా ఇసుక విధానం: మంత్రి పేర్ని నాని

ABN , First Publish Date - 2020-12-02T16:09:31+05:30 IST

అవినీతికి తావులేకుండా పారదర్శకతతో..

అవినీతికి తావులేకుండా ఇసుక విధానం: మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం‌: అవినీతికి తావులేకుండా పారదర్శకతతో ఇసుక విధానం అమలు చేస్తామని రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఉదయం తన కార్యాలయానికి వచ్చిన సందర్శకుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులకు ఇసుక అవసరమని, కొందరు ప్రైవేట్‌ వ్యాపారులకు 18 టన్నుల ఇసుకను రూ. 23వేలకు విక్రయిస్తున్నారని, దీంతో భవన యజమానులు ఇసుక కొనలేకపోవడం వల్ల పనులు ఆగిపోతున్నాయని బృందావనపుర తాపీ పనివారల సంఘ అధ్యక్షులు వేమూరి గంగయ్య, కార్యదర్శి రమణ, సీఐటీయూ నాయకులు జయరావు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి టన్ను ఇసుక రూ.800కు అమ్మేలా చర్యలు తీసుకుంటామన్నారు.  

Updated Date - 2020-12-02T16:09:31+05:30 IST