ఏపీలో పార్టీ పెడతానన్న సీఎం కేసీఆర్‌కు పేర్ని నాని కౌంటర్

ABN , First Publish Date - 2021-10-28T21:55:20+05:30 IST

ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై రాష్ట్ర మంత్రి

ఏపీలో పార్టీ పెడతానన్న సీఎం కేసీఆర్‌కు పేర్ని నాని కౌంటర్

అమరావతి: ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే బాగుంటుందని ఆయన అన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు. సీఎం  కేసీఆర్ పథకాలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర మైక్ పెడితే బాగా చెప్తారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేసారు. 



టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఏపీ రాష్ట్ర ప్రజలు ఆకర్శితులవుతున్నారన్నారు. ఏపీలో కూడా టీఆర్‌ఎస్ పార్టీ పెట్టాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-28T21:55:20+05:30 IST