సినిమాలను ఎందుకు వాయిదా వేసుకోరు: మంత్రి పేర్ని

ABN , First Publish Date - 2022-01-10T23:17:54+05:30 IST

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతో భేటీ తరువాత మంత్రి

సినిమాలను ఎందుకు వాయిదా వేసుకోరు: మంత్రి పేర్ని

అమరావతి: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతో భేటీ తరువాత మంత్రి పేర్ని నాని మాట్లాడారు. సిని పరిశ్రమకు మంత్రి పేర్ని నాని సలహా ఇచ్చారు. కోవిడ్ కేసులు పరుగెడుతుంటే సినిమాలను వాయిదాలు ఎందుకు వేసుకోరని ఆయన ప్రశ్నించారు. రాధే శ్యామ్ , ట్రిపుల్ ఆర్‌లు ఎందుకు వాయిదా వేసుకున్నారన్నారు. సినిమా టికెట్ తగ్గింపుతో నాగార్జునకూ ఇబ్బంది లేదు, నాకూ ఇబ్బంది లేదు, మరి మీకెందుకు ఇబ్బంది అంటూ మంత్రి ఎదురు ప్రశ్న వేశారు. సినిమా పరిశ్రమపై డిస్కస్ చేయడానికి కమిటీ మంగళవారం భేటీ అవుతుందన్నారు. జీవో 35, రేట్లుపై మరోసారి చర్చించేందకు కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-01-10T23:17:54+05:30 IST