ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంలేదు: వైసీపీ ఎంపీ

ABN , First Publish Date - 2020-07-01T18:52:39+05:30 IST

పార్లమెంట్‍కు వెళ్లాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంలేదు: వైసీపీ ఎంపీ

అమరావతి: పార్లమెంట్‍కు వెళ్లాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి కార్యదర్శికి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ఏడాది కాలం సంతృప్తిగా పనిచేసినట్లు వెల్లడించారు. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నా. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నాకైతే నమ్మకం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.’’ అని చెప్పారు. ఇక రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై స్పందిస్తూ.. ఎంపీలు ఎవరైనా పార్టీకి విధేయులుగా ఉండాలని సూచించారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాలని సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-01T18:52:39+05:30 IST