విద్యార్థినులకు నెలకు రూ.1,000

ABN , First Publish Date - 2022-05-12T13:29:31+05:30 IST

ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి నెలనెలా రూ.1,000 అందించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని వచ్చే

విద్యార్థినులకు నెలకు రూ.1,000

- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

- మంత్రి పొన్ముడి


పెరంబూర్‌(చెన్నై): ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి నెలనెలా రూ.1,000 అందించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అన్నా విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల నుంచి పాత ఫీజులే వసూలుచేస్తామని తెలిపారు. ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ ఎప్పుడు నిర్వహించాలనే విషయమై విద్యానిపుణులతో చర్చిస్తున్నామని, ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని, ఎలాంటి అవినీతి తావులేకుండా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. ‘నీట్‌’ ఫలితాలు వెల్లడైన అనంతరం ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముందని తెలిపారు. ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలల్లో పీజీ కోర్సుల విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.

Read more