హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరుతో సైబర్ చీటర్స్ నకిలీ ఈమెయిల్ సృషించారు. టీఎస్ ఆర్టీసీ చీఫ్ కంట్రోల్ మేనేజర్‌కు ఈమెయిల్ పంపించారు. అది నకిలీ ఈమెయిల్ అని గుర్తించిన చీఫ్ కంట్రోల్ మేనేజర్... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.