‘మహిళలు సంతోషంగా ప్రయాణిస్తున్నారు’

ABN , First Publish Date - 2022-03-23T17:13:16+05:30 IST

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల మహిళలు ఎంతో సంతోషంగా ప్రయాణం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజకన్నప్పన్‌

‘మహిళలు సంతోషంగా ప్రయాణిస్తున్నారు’

                   - మంత్రి రాజకన్నప్పన్‌


అడయార్‌(చెన్నై): ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల మహిళలు ఎంతో సంతోషంగా ప్రయాణం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజకన్నప్పన్‌ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెల్లూరు కెరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేది ముఖ్యమంత్రి స్టాలిన్‌ కలల పథకం. మహిళల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. అన్ని బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించ వచ్చని ప్రకటిస్తే రవాణా సంస్థలను ఏ విధంగా నడపాలి? అని ప్రశ్నించారు. ఇప్పటికే రవాణా సంస్థలు దాదాపు రూ.48 వేల కోట్ల నష్టంలో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.

Updated Date - 2022-03-23T17:13:16+05:30 IST