మానవత్వాన్ని చాటిన మంత్రి రజిని

ABN , First Publish Date - 2022-05-20T05:11:18+05:30 IST

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడగా వారిని శర వేగంగా ఆస్పత్రికి చేర్చడంలో మంత్రి రజిని చొరవ చూపారు

మానవత్వాన్ని చాటిన మంత్రి రజిని
క్షతగాత్రులను దగ్గరుండి 108లో ఎక్కిస్తున్న మంత్రి రజిని

రోడ్డు ప్రమాదంలో మహిళలకు తీవ్రగాయాలు

కాన్వాయ్‌ ఆపి క్షతగాత్రుల అండగా నిలిచి..

108లో జీజీహెచ్‌కు తరలింపు

పెదకాకాని, మే 19 : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడగా వారిని శర వేగంగా ఆస్పత్రికి చేర్చడంలో మంత్రి రజిని చొరవ చూపారు. విజయవాడకు చెందిన నూర్జహాన్‌, ఉమేదాలు తమ నూతన ద్విచక్ర వాహనానికి పెదకాకాని బాజీ బాబాదర్గా వద్ద గురువారం పూజ చేయించుకొని విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న ట్రావెల్‌ బస్సు వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఆ మహిళలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ సందర్భంలో ఏపీ సచివాలయం వైపు వెళుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రమాద ఘటనను గమనించారు.  తన కాన్వాయ్‌ని ఆపి క్షతగాత్రుల వద్దకు వెళ్లి 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చి, వాహనం వచ్చే వరకు వేచి వుండి, తన వ్యక్తిగత సిబ్బందిని క్షతగాత్రులతో పాటు 108 వాహనంలో ఎక్కించి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపిం చారు. అనంతరం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతికి ఫోన్‌ చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని  మంత్రి విడదల రజిని ఆదేశించారు. 

Updated Date - 2022-05-20T05:11:18+05:30 IST