కృష్ణా డెల్టాకు 10 నుంచి సాగు నీరు

ABN , First Publish Date - 2022-05-18T05:20:50+05:30 IST

పులిచింతల ప్రాజెక్టులో సరిపడా నీరు ఉందని, కృష్ణా డెల్టాకు జూన్‌ 10వ తేదీ నుంచి నీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

కృష్ణా డెల్టాకు 10 నుంచి సాగు నీరు
పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు

మంత్రి అంబటి రాంబాబు

అచ్చంపేట, మే 17: పులిచింతల ప్రాజెక్టులో సరిపడా నీరు ఉందని, కృష్ణా డెల్టాకు జూన్‌ 10వ తేదీ నుంచి నీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టును ఆయన మంగళవారం సందర్శించారు. పులిచింతల ప్రాజెక్టు అన్ని గేట్లను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా మూడు పంటలు పండించు కోవటానికి సరిపడా నీరు ఉన్నదని, సీజన్‌ త్వరలోనే ప్రారంభ మవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఊడిపోయిన గేటు స్థానంలో అమర్చిన స్టాప్‌ లాక్‌ వల్ల ఇబ్బంది లేదని, అన్ని గేట్లు సమర్ధతపై కమిటీ వేశారని తెలిపారు. ఆయనతో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ప్రాజెక్టు ఎస్‌ఈ వై.శ్రీనివాస్‌, ఈఈ ఆర్‌.శ్యామ్‌ ప్రసాదు, పులిచింతల ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ వినాయక్‌, డిప్యూటీ కలెక్టర్‌ వసంత బాబు, ప్రాజెక్టు ఇంజనీర్లు రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు మండలంలోని వైసీపీ నాయకులు ఉన్నారు. 

  

Updated Date - 2022-05-18T05:20:50+05:30 IST