ప్రభుత్వ పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-03-01T04:32:50+05:30 IST

ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అహ్లాదకరంగా తీర్చిదిద్దాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఆత్మకూరు, ఫిబ్రవరి 28 : ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అహ్లాదకరంగా తీర్చిదిద్దాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నెల్లూరులోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో నాడు-నేడు పనులపై అధికారులతో సమీక్షించారు. నాడు-నేడు కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, తరాతరాల భవిష్యత్తుకు నిర్మాణమని గమనించాలని సూచించారు. నియోజకవర్గంలో ఇంకా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మొదటి విడత పనులన్నీ మార్చి నెలాఖరుకు పూర్తికావాలని ఆదేశించారు. నిధుల విడుదలలో ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తేవాలని సూచించారు. ప్రతి మండలంలో ఒక మినీ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-03-01T04:32:50+05:30 IST