Minister Roja: కొడాలి నాని భాషలో తప్పేముందన్న మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-09-15T16:21:07+05:30 IST

రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

Minister Roja: కొడాలి నాని భాషలో తప్పేముందన్న మంత్రి రోజా

అమరావతి (Amaravathi): రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని మంత్రి రోజా (Minister Roja) వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ టీడీపీ (TDP) గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందన్నారు. మూడు రాజధానుల బిల్ పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని టీడీఎల్పీ (TDLP) సమావేశంలో చర్చించారని.. ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోందని, అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. చంద్రబాబు (Chandrababu) వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా? అని మంత్రి ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైసీపీ ఎమ్మల్యేలు ఎందుకు రాజీనామా చేయాలన్నారు. రాంగ్ రూట్‌లో  ఎమ్మెల్సీ అయిన లోకేష్ (Lokesh)  సీఎం జగన్‌ (CM Jagan)పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామన్నారు. మాజీ మంత్రి కొడాలినాని భాషలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. ఆయనపై ఈగ వాలితే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ రౌడీయీజం చేస్తూ ఇళ్ళపై దాడి చేస్తారా? అంటూ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా ఏపీ అసెంబ్లీ (AP Assembly session) సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం (AP Government)జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) తిరస్కరించారు. దీంతో శాసనసభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు  పట్టుబట్టారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2022-09-15T16:21:07+05:30 IST