మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడం అత్యాశే

ABN , First Publish Date - 2022-07-05T07:22:07+05:30 IST

దివాన్‌చెరువు, జూలై 4 : మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు తహతహలాడడం అత్యాశే అవుతుందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రోజా అన్నారు. రాజానగరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం దివాన్‌చెరువులోని ఎంఎఫ్‌ కన్వెన్షన్‌లో ఆ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న రోజా మాట్లాడుతూ భీమవరం సమావేశం చూసి భీమ్లా

మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడం అత్యాశే
దివాన్‌చెరువులో సోమవారం జరిగిన రాజానగరం వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతున్న మంత్రి రోజా

రాజానగరం నియోజకవర్గ  వైసీపీ ప్లీనరీలో రోజా

 దివాన్‌చెరువు, జూలై 4 : మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు తహతహలాడడం అత్యాశే అవుతుందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రోజా అన్నారు. రాజానగరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం దివాన్‌చెరువులోని ఎంఎఫ్‌ కన్వెన్షన్‌లో ఆ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న రోజా మాట్లాడుతూ భీమవరం సమావేశం చూసి భీమ్లానాయక్‌ బిగుసుకుపోయాడని వ్యాఖ్యానించారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, ఈ బలంతోనే సీఎం జగన్‌ రాష్ట్రానికి చక్కని పాలన అందిస్తున్నారన్నారు. ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ రాష్ట్ర వైసీపీ ప్లీనరీకి వేలాదిగా తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజానగరం ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ పార్టీ ప్రయోజనాలకోసం తాను, ఎంపీ భరత్‌ కలసి ముందుకు వెళ్తున్నామని, అలాగే ప్రతీ గ్రామంలో కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, సత్తి సూర్యనారాయణరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, రుడా, కుడా చైర్‌పర్సన్లు ఎం.షర్మిలారెడ్డి, ఆర్‌.చంద్రకళాదీప్తి, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, నాయకులు చందన నాగేశ్వర్‌, జక్కంపూడి గణేష్‌, దూలం పద్మా వెంకన్నబాబు, దూలం పెద్ద, మండారపు వీర్రాజు. జడ్పీటీసీ వాసంశెట్టి పెద వెంకన్న, ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T07:22:07+05:30 IST