Minister Roja : పవన్‌పై రోజా సంచలన కామెంట్స్

ABN , First Publish Date - 2022-09-19T20:32:35+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Jansena Chief Pawan Kalyan)పై మంత్రి రోజా(Minister Roja) సంచలన కామెంట్స్ చేశారు.

Minister Roja : పవన్‌పై రోజా సంచలన కామెంట్స్

Minister Roja : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Jansena Chief Pawan Kalyan)పై మంత్రి రోజా(Minister Roja) సంచలన కామెంట్స్ చేశారు. నేడు అసెంబ్లీ మీడియా పాయింట్‌(Assembly Media Point)లో ఆమె మాట్లాడుతూ.. పవన్‌ 2014లో పార్టీ పెట్టి వారికి, వీరికి మద్దతు ఇచ్చారని.. ఆయన్ను చూసి తెలుగు హీరోలు తలదించుకుంటున్నారని అన్నారు. ‘టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పాదయాత్ర వాయిదా వేసుకుంటే, నువ్వు వాయిదా వేసుకుంటావా?’ అని పేర్కొన్నారు. పవన్కు 175 సీట్‌లలో పోటీ చేసే అభ్యర్ధులు లేరని ఎద్దేవా చేశారు. వీకెండ్ బై ఆర్కే(Weekend by RK) స్థానంలో పీకేను చూస్తున్నామని రోజా పేర్కొన్నారు. 


ఇంకా రోజా మాట్లాడుతూ.. ‘‘వైసీపీ(YCP)కి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. ఇది విని రాష్ట్రంలోని ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్ సీఎం(Jagan CM) కాలేవు అన్నావు.. నువ్వు ఎమ్మెల్యేవి కాలేకపోయావు. చిన్న పిల్లలు నీ మీటింగ్‌కు వస్తే సీఎం అనుకున్నావు. సినిమా ఇండస్ట్రీ(Movie Industry) నుంచి ఎన్‌టీఆర్(NTR) పార్టీ పెట్టీ అధికారంలోకి సింగిల్‌గా వచ్చారు. చిరంజీవి(Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ(Prajarajyam) పెట్టి సింగిల్‌గా పోటీ చేశారు. జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy), తెలంగాణ సీఎం కేసీఆర్‌(Telangana CM KCR)తో భోజనం చేసి హక్కులు రాష్ట్రం వదులుకున్నారని అంటున్నారు.. బీజేపీ, టీడీపీలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌(Hyderabad)ను వదిలి వచ్చినప్పుడు నువ్వు షూటింగ్‌లో ఉన్నావా? షుట్ కేసులు తీసుకుంటున్నావా? 


నీకు దమ్ముంటే 175 సీట్లలో నీ అభ్యర్ధులను పెట్టి జగన్‌(Jagan)తో ఢీకొను. పందులే గుంపుగా వస్తాయి. ఈ రోజు లోకేష్ ఒక బుర్ర తక్కువ పని చేస్తున్నాడు. లోకేష్‌(Nara Lokesh)కు కేవలం అధికార దాహం. అందుకే ఎంఎల్‌సీ, మంత్రి అయ్యాడు. పొద్దున్నే ఎద్దుల బండి ఎక్కి వస్తుంటే చూసిన వాళ్లు నవ్వుకుంటున్నారు. లక్ష 23 వేల కోట్ల ఈ ప్రభుత్వం రైతులకు మూడున్నర ఏళ్లలో అందించింది. నువ్వు అసెంబ్లీ పై జనసేన జెండా ఎగురవేస్తా అన్నావు. నువ్వు అసెంబ్లీలోనే అడుగుపెట్టాకుండా చేశాం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-19T20:32:35+05:30 IST