అఫ్ఘాన్‌లోని భారత ప్రవాసుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ

ABN , First Publish Date - 2021-08-17T16:56:34+05:30 IST

తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్థాన్‌ను వశపరచుకోవడంతో ప్రస్తుతం ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

అఫ్ఘాన్‌లోని భారత ప్రవాసుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ

న్యూఢిల్లీ: తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్థాన్‌ను వశపరచుకోవడంతో ప్రస్తుతం ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్ఘాన్‌లోని విదేశీయులు తమ దేశాలకు తరలిపోతున్నారు. భారత్ కూడా ప్రవాసులను స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న భారత ప్రవాసుల కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ ప్రత్యేక సెల్‌కు హెల్ప్‌లైన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలను కేటాయించినట్లు మంత్రి ఎస్ జయశంకర్ సోమవారం వెల్లడించారు. అఫ్ఘాన్‌లోని భారతీయులు ఈ హెల్ప్‌లైన్ నెంబర్, ఈ-మెయిల్ ద్వారా తమను కాంటాక్ట్ చేయవచ్చని తెలిపారు. 


ప్రవాసులను స్వదేశానికి తరలించడంలో ఇది కీలక పాత్రం పోషిస్తుందని మంత్రి తెలిపారు. కాబూల్‌లోని పరిస్థితిని అనుక్షణం పరిశీలిస్తున్నట్లు చెప్పిన మంత్రి.. ప్రస్తుతం అక్కడ నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న భారత ప్రవాసుల మనోగతాన్ని అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. అఫ్ఘానిస్థాన్‌లోని ప్రతి భారత పౌరుడిని తప్పకుండా స్వదేశానికి తీసుకువస్తామని ఈ సందర్భంగా జయశంకర్ స్పష్టం చేశారు. ఇక కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అఫ్ఘాన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ హెల్ప్‌లైన్ ఫోన్ నెంబర్: +919717785379, అలాగే ఈ-మెయిల్: MEAHelpdeskIndia@gmail.com 



Updated Date - 2021-08-17T16:56:34+05:30 IST