దేశానికే ఆదర్శంగా ఫీవర్ సర్వే: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ABN , First Publish Date - 2022-02-22T21:18:55+05:30 IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వే దేశానికి

దేశానికే ఆదర్శంగా ఫీవర్ సర్వే: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లాలోని ఆశ కార్యకర్తలకు స్మార్ట్’ఫోన్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశా కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయమన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఆశా వర్కర్లు చేసిన సేవ ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు. కోవిడ్ సమయంలో చేసిన కష్టాన్ని గుర్తించి ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను సీఎం అందిస్తున్నారన్నారు. ఆశ కార్యకర్తల జీతాలను 3 వేల నుంచి 9 వేలకు కేసీఆర్ పెంచారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-22T21:18:55+05:30 IST