వరదముప్పుపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-23T06:10:13+05:30 IST

వరదముప్పుపై అప్రమత్తంగా ఉండాలి

వరదముప్పుపై అప్రమత్తంగా ఉండాలి
టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

కంట్రోల్‌ రూంలు 24 గంటలు పనిచేయాలి 

మంత్రి సత్యవతిరాథోడ్‌ 

మహబూబాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : వరు సగా కురుస్తున్న వర్షాలు.. రానున్న మూడు రోజుల్లో మరింత భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు పూర్తి స్థాయిలో అం దుబాటులో ఉండాలని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌  అధికారులను ఆదేశిం చారు. గోదావరి, కృష్ణ పరివాహాక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ ఆదేశా లతో హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నీటి పారుదల శాఖ అధికారులతో గురువారం టెలి కాన్ఫరె న్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అవసరమ యితే తప్ప ఇండ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ములుగు, భూపా లపల్లి జిల్లాలకు రెడ్‌ ఆలర్ట్‌, మహబూబాబాద్‌ జిల్లాకు అరెంజ్‌ అలెర్ట్‌ ను వాతావరణ శాఖ జారీ చేసినందున వర్షాలతో ఎ లాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటూ పర్యవేక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి భద్రతకు కావాల్సిన చర్యలు చేపట్టాల న్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించి పునరావాసం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాం టి ప్రాణనష్టం జరుగకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

చెరువులు, కాల్వలు, కుంటల్లో బలహీనంగా ఆనకట్ట లను గుర్తించి వాటిని పటిష్టం చేసే చర్యలు చేపట్టా ల న్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్నారు. ఎలాంటి సమా చారం ఉన్న వెంటనే తనకు అందించాలని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులకు చెప్పారు. 

 

Updated Date - 2021-07-23T06:10:13+05:30 IST