హరితహారంతో మానుకోటకు సరికొత్త శోభ

ABN , First Publish Date - 2021-07-25T06:12:24+05:30 IST

హరితహారంతో మానుకోటకు సరికొత్త శోభ

హరితహారంతో మానుకోటకు సరికొత్త శోభ
చింతోనిగుంపులో మొక్కలు నాటుతున్న మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ

మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులకిరువైపులా మొక్కలు నాటి మానుకోట పట్టణా నికి సరికొత్త శోభను తీసుకరావాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. మహబూబా బాద్‌ జిల్లా కేంద్రం శివారు జమాండ్లపల్లి జాతీయ రహదారి పక్కన అటవీశాఖ ఆధ్వర్యంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగం గా శనివారం మొక్కలు నాటారు. ఈసంద ర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడారు. జిల్లా కేంద్రం ముఖద్వారాల వద్ద చేపట్టే అవెన్యూప్లాంటే షన్‌ను అందంగా చేపట్టాల న్నా రు. మహబూబాబాద్‌లో విరివిగా  మొక్కలు నాటాలని తెలి పారు. జాతీయ రహదారులకిరువైపులా మొక్కలు నాటి వాటి ని సంరంక్షించి భావితరాలకు ఆహ్లాదాన్ని అందించాలన్నారు. అదేవిధంగా పూల మొక్కలు నాటాలని సూచించారు. తెలంగా ణ రాష్ట్రంలో అంతరించిపోయిన అడవులు పెంచాలనే బృహత్‌ సంకల్పంతో ముఖ్యమంత్ర కేసీఆర్‌ హరితహారం పథ కాన్ని తీసుకవ చ్చారని తెలిపారు. ప్రతీ ఒక్కరు విధిగా మొ క్కలు నాటాలన్నారు. జిల్లాలో హరితలక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, అటవీశాఖాధికారి రవికిరణ్‌, ఎక్సైజ్‌ అధికారి దశరధ్‌, కృష్ణమాచారి పాల్గొన్నారు.

 బయ్యారం : భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కోసం పల్లె ప్రకృతి వనాలు ఉపయోగపడుతాయని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బయ్యారం మండలం రామచంద్రాపురం శివారు చింతోనిగుంపు అటవీక్షేత్రంలో ఐటీ శాఖ మంత్రి కేటీ ఆర్‌ పుట్టినరోజు సందర్భంగా డీఎఫ్‌వో రవికిరణ్‌ ఆధ్వర్యంలో మంత్రితోపాటు ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే బానోత్‌ హరి ప్రియ, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. అడవులను కాపాడు కోవాలనే ఉద్దేశం తో హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ చేపట్టారని తెలి పారు. జిల్లాలో 16వేల ఎకరాల్లో ఆరువేల ఎకరాలను రెవెన్యూ భూమిగా నిర్ధారించారని తెలిపారు. గార్ల, బయ్యారం మండ లాల్లోని రైతులకు సాగు నీరందించేందుకు సీతారామ ప్రాజె క్టు చేపట్టామన్నారు. గార్ల మండలం రాంపురం వద్ద మున్నే రుపై బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని చెప్పారు. ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య, తహసీల్దార్‌ నాగభ వాని, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీవో పద్మ, సర్పంచ్‌ పి.వెం కటేశ్వర్లు, ఎంపీటీసీ గట్ల లక్ష్మి, తొట్టి కరుణ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-25T06:12:24+05:30 IST