Bathukamma sarees: సమ్మక్క-సారలమ్మకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి

ABN , First Publish Date - 2022-09-22T15:30:52+05:30 IST

బతుకమ్మ పండుగ(Batukamma sarees)ను పురస్కరించుకు ఏటా తెలంగాణ ప్రభుత్వం (Telangana government) రాష్ట్రంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది.

Bathukamma sarees: సమ్మక్క-సారలమ్మకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి

ములుగు: బతుకమ్మ పండుగ(Batukamma sarees)ను పురస్కరించుకు ఏటా తెలంగాణ ప్రభుత్వం (Telangana government) రాష్ట్రంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కూడా ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavati rathod) గురువారం ఉదయం ములుగు గట్టమ్మకు, మేడారం సమ్మక్క-సారలమ్మల (Sammakka - saralamma)కు బతుకమ్మ చీరెలు సమర్పించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. కొందరు రాజకీయ లబ్ధికోసం సీఎం కేసీఆర్‌ (CM KCR)పై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మీరు పాలించే రాష్ట్రాల గురించి మాట్లాడండి అంటూ హితవుపలికారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అక్కడ అమలవుతున్నాయా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మహిళలకు త్వరలోనే బ్యూటీషియన్ కిట్లు పంపిణీ చేయబోతున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 

Updated Date - 2022-09-22T15:30:52+05:30 IST