పుంగనూరు జాతి పశువుల అభివృద్ధే మిషన్ పుంగనూరు లక్ష్యం: మంత్రి Appalaraju

ABN , First Publish Date - 2021-09-07T18:53:13+05:30 IST

పుంగనూరు జాతి పశువుల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మిషన్ పుంగనూరు కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

పుంగనూరు జాతి పశువుల అభివృద్ధే మిషన్ పుంగనూరు లక్ష్యం: మంత్రి Appalaraju

గుంటూరు: పుంగనూరు జాతి పశువుల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మిషన్ పుంగనూరు కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం లాం ఫాంలోని పశు పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన మంత్రి మిషన్ పుంగనూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ పుంగనూరు కార్యక్రమానికి రూ.69 కోట్లు కేటాయించామని అన్నారు. వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు. అంతరించుపోతున్న పుంగనూరు జాతిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. లాం ఫాంలోని పరిశోధన కేంద్రంలో ఆధునిక వసతులు ఉన్నాయని అన్నారు. ఒంగోలు జాతి పశువుల రక్షణలో లాం ఫాంలోని పరిశోధన కేంద్రం ఎంతగానో కృషి చేసిందని చెప్పారు. ఇప్పుడు పుంగనూరు జాతి విషయంలో కూడా అదే కృషి జరపనుందని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-07T18:53:13+05:30 IST