నెలాఖరులోగా రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు

ABN , First Publish Date - 2022-03-23T14:35:11+05:30 IST

రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఈ నెలాఖరులోగా ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మం జూరు చేయనున్నట్లు విద్యుత్‌ శాఖా మంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రకటించారు. శాసనసభలో మంగళవారం

నెలాఖరులోగా రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు

- అన్నదాతలకు భరోసా

- అసెంబ్లీలో మంత్రి సెంథిల్‌బాలాజి ప్రకటన


చెన్నై: రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఈ నెలాఖరులోగా ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మం జూరు చేయనున్నట్లు విద్యుత్‌ శాఖా మంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో మడత్తుకుళం ఎమ్మెల్యే మహేంద్రన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ... రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ కనెక్షన్లను క్రమబద్ధీకరించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, తొలి విడతగా కరూరు, తంజావూరు, తిరువణ్ణామలైలో మూడు విద్యుత్‌ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లక్షమంది రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు పథకాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారని, ఆ పథకం కింద ఇప్పటివరకూ 87465 మంది రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామని ఈ నెలాఖరులో తక్కిన రైతులందరికీ ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి బాలాజీ హామీ ఇచ్చారు.  

Updated Date - 2022-03-23T14:35:11+05:30 IST