మంత్రి Shashikala హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2021-12-09T18:16:47+05:30 IST

రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, వక్ఫ్‌, హజ్‌, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి శశికళ జొల్లెపై దాఖలైన జీరో ట్రాఫిక్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 4న శశికళా జొల్లె మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు హాజరు కావాల్సి

మంత్రి Shashikala హైకోర్టులో ఊరట

                              - జీరో ట్రాఫిక్‌ కేసు కొట్టివేత


బెంగళూరు: రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, వక్ఫ్‌, హజ్‌, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి శశికళ జొల్లెపై దాఖలైన జీరో ట్రాఫిక్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 4న శశికళా జొల్లె మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు హాజరు కావాల్సి ఉండగా ఆమె ప్రయాణించిన విమానం ఆలస్యం కావడంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌ వరకు త్వరగా చేరుకునేందుకు జీరో ట్రాఫిక్‌ సదుపాయం ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆ రోజు ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిందంటూ న్యాయవాది బాలాజీ నాయుడు హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌అవస్థి ‘జీరో ట్రాఫిక్‌’ వల్ల ఆ రోజు ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడిందన్న అంశానికి సంబంధించి పిటీషనర్‌ తగిన ఆధారాలు సమర్పించకపోవడం తో కేసును కొట్టేస్తున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2021-12-09T18:16:47+05:30 IST