తెలంగాణలోని పలు పురాతన కట్టడాలను కేంద్రం గుర్తించాలి

ABN , First Publish Date - 2021-09-02T21:01:54+05:30 IST

తెలంగాణలోని గోల్కొండ, వేయిస్తంభాల గుడి, బాసర, చార్మినార్ వంటి కట్టడాలను సైతం యునెస్కో గుర్తించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రానికి విన్నవించారు.

తెలంగాణలోని పలు పురాతన కట్టడాలను కేంద్రం గుర్తించాలి

హైదరాబాద్: తెలంగాణలోని గోల్కొండ, వేయిస్తంభాల గుడి, బాసర, చార్మినార్ వంటి కట్టడాలను సైతం యునెస్కో గుర్తించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రానికి విన్నవించారు.ఢిల్లీలో భారత పురావస్తు సర్వేశాఖ డైరెక్టర్ జనరల్ విద్యావతి కలిశారు.ఈ సందర్భంగా ఆయన ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ స్థానాలలో తెలంగాణలోని రామప్ప దేవాలయం వరంగల్ కు ప్రత్యేక గుర్తింపు కల్పించినందుకు వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారై ఉండి ఈ గుర్తింపు రావడం కోసం కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.


తెలంగాణలోని గోల్కొండ ,వేయి స్తంభాల గుడి, బాసర ,చార్మినార్ లకు కూడా ప్రత్యేక గుర్తింపు కల్పించవలసిందిగా యునెస్కో నకు ప్రతిపాదించ వలసిందిగా మంత్రి వారిని కోరారు. హైదరాబాదులోని గోల్కొండ లో గల సౌండ్ ,లైట్లను నవీనీకరణ చేయాలని కూడా కోరారు.భారత పురావస్తు సర్వే బృందాన్ని తెలంగాణలోని హైదరాబాదును సందర్శించి యాదాద్రి, భద్రాచలం ,మహబూబ్ నగర్ లోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సందర్శించవలసిందిగా కోరారు. ఆ దేవాలయాల అభివృద్ధికి నిధులను విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసి అధునాతన టెక్నాలజీ ద్వారా పునర్నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయాన్ని సందర్శించవలసిందిగా ఆయన అభ్యర్ధించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట టూరిజం అధికారులు మనోహర్, శంకర్ రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-02T21:01:54+05:30 IST