సంక్షేమ పథకాలతో తెలంగాణ ఓ ప్రయోగశాల: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2021-04-14T20:07:12+05:30 IST

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ ఓ ప్రయోగశాలగా మారిందని మంత్రి శ్రీనివాస్

సంక్షేమ పథకాలతో తెలంగాణ ఓ ప్రయోగశాల: మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ ఓ ప్రయోగశాలగా మారిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జడ్చర్లలో ఆయన మాట్లాడారు. జడ్చర్లలో కావేరమ్మపేట, జడ్చర్ల, బాదేపల్లి భౌగోళికంగా విభజింపబడి అభివృద్ధికి ఆటంకంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పాటుతో అభివృద్ధికి ముందడుగు పడిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీలపై కేసీఆర్, కేటీఆర్ రెండు కళ్లలాగా, వాచ్‌డాగ్ లాగా పనిచేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచనను కేటీఆర్ అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. 


Updated Date - 2021-04-14T20:07:12+05:30 IST