చరిత్రను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది: మంత్రి Srinivas

ABN , First Publish Date - 2022-07-07T18:34:48+05:30 IST

కాకతీయుల చరిత్రను బావి తరాలకు తెలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

చరిత్రను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది: మంత్రి Srinivas

వరంగల్: కాకతీయుల చరిత్రను బావి తరాలకు తెలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud) అన్నారు. కాకతీయ వైభవ సప్తాహం ఉత్సావాలను ప్రారంభించేందుకు వరంగల్‌కు విచ్చేసిన కాకతీయ సామ్రాజ్యపు వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ  (Kamal chandra bhanj dev kakatiya)కు మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి ఆలయంలో కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud), సత్యవతి (Satyavati), ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay bhaskar) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... కాకతీయుల వారసున్ని పిలిచి ఉత్సవాలు చేస్తున్నామన్నారు. చరిత్రను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. వరంగల్ అంటే కేసీఆర్‌(KCR)కు ప్రేమ ఎక్కువన్నారు. కాకతీయుల ఆదర్శంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆలయాలను, చెరువులను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. తెలంగాణ పతకాలు దేశ వ్యాప్తంగా అమలుకావాలని భద్రకాళీ మాతను వేడుకున్నామన్నారు. గత ప్రభుత్వాలు కాకతీయుల ఘనమైన చరిత్రను మరుగునపడేలా చేశాయని విమర్శించారు. కేసీఆర్ పట్టుదలతో నేడు కాకతీయుల చరిత్ర ప్రపంచానికి తెలిసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-07T18:34:48+05:30 IST