పూడికతీత పనుల్లో ప్రణాళికేదీ?

ABN , First Publish Date - 2022-01-25T06:30:13+05:30 IST

‘డ్రెయిన్లు, కాలువల్లో పూడికతీత పను లు వేసవి నాటికి పూర్తి చే యాల్సి ఉంది. అందుకు తగి న ప్రణాళిక కనిపించడం లేదు. లాకుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తాగు నీరు వృథా అవుతుంది’ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.

పూడికతీత పనుల్లో ప్రణాళికేదీ?
మాట్లాడుతున్న మంత్రి రంగనాథరాజు

మంత్రి రంగనాథరాజు

ఏలూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘డ్రెయిన్లు, కాలువల్లో పూడికతీత పను లు వేసవి నాటికి పూర్తి చే యాల్సి ఉంది. అందుకు తగి న ప్రణాళిక కనిపించడం లేదు. లాకుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తాగు నీరు వృథా అవుతుంది’ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రబీ సాగుకు పూర్తి స్థాయిలో సాగు నీటి వనరులు అందించేందుకు అధికారులు నిబద్ధతతో పని చేయాలని కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాగు నీటి సరఫరా పెంపు కోసం విడుదల చేసిన రూ.10 కోట్లు సద్వినియోగం చేయా లన్నారు. కలెక్టర్‌  మిశ్రా మాట్లాడుతూ రబీ సాగుకు సంబంధించి ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇప్పటికే 3,46,225 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయని చెప్పారు. 38,826 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూర్చడం కోసం రూ.211.83 కోట్లతో ప్రతిపాదిన 135 క్రాస్‌ బండ్‌ పనులు చేపట్టామన్నారు. సలహా మండలి చైర్మన్‌ సుబ్బారావు, ఇతర సభ్యులు మిగులు నీరు, యూరియా, సోసైటీ కేంద్రాలు, లాకు లు, డ్రెయిన్లలో పూడికతీత తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ఉంగు టూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు, జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌, సలహా మండలి సభ్యులు, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్‌, నాబార్డు, బ్యాంకు, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-01-25T06:30:13+05:30 IST