వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు

ABN , First Publish Date - 2021-11-27T06:31:56+05:30 IST

వ్యవసాయమే జీవనాధారంగా బతికే జిల్లాలో ప్రతి ఏటా అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు.

వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు
రాప్తాడు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి ఇదీ..

మంత్రి గారూ..  ఆదుకోండి..!

వేల ఎకరాల్లో పంట నష్టం

డ్రిప్పు పరికరాలు అందక అగచాట్లు

గుంతల రోడ్లపై ప్రయాణం నరకం

రెండున్నరేళ్లలో కానరాని అభివృద్ధి

ఉపాధి కోసం యువత వలసబాట

అనంతపురం, నవంబరు26(ఆంధ్రజ్యోతి): వ్యవసాయమే జీవనాధారంగా బతికే జిల్లాలో ప్రతి ఏటా అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. దీంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు కుప్పలై రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. ఒక వేళ ప్రకృతి విపత్తులు తప్పించుకుని పంట పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఉండదు. అరకొరగా పండిన పంటను సైతం మార్కెట్‌లో కొనేవారు లేక రైతులు అయినకాడికి అమ్ముకునే పరిస్థితి. పాలకులేమో మాది రైతు ప్రభుత్వమని, రైతులను ఆదు కుంటామని ప్రకటనలు గుప్పిస్తారేగాని గిట్టుబాటుకు ధర కు పంటను కొనరు. ఏదో రైతు భరోసా పథకం పేరిట కా సిన్ని సొమ్ములు అకౌంట్లలో వేసి చేతులు దులుపుకుం టున్నారు. కరువు కాలంలో డ్రిప్పు సాయంతో పంట పం డిద్దామంటే రెండేళ్లుగా ఆ సౌకర్యాన్ని పూర్తిగా రద్దు చేశా రు. గత ప్రభుత్వాలు 90 శాతం సబ్సిడీతో డ్రిప్పు ఇచ్చి రైతులను ఆదుకునేవి. ఇటీవల జిల్లాలో ఎన్నడూ లేనం తగా  కురిసిన భారీ వర్షాలు, వరదలు రైతుల పంట పొలాలను ముంచేసి తీవ్ర నష్టం కలిగించాయి. వరుస తుఫాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు కోత దశలో ఉన్న వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, వరి పంటలు, కాత దశలో ఉన్న కంది, విత్తు, మొలకదశలో ఉన్న పప్పుశనగ పంటలకు భారీగా నష్టాన్ని కలిగించాయి. చెరువులు, కుంటలు నీటితో నిండుగా తొణికిసలాడుతున్నాయి. ఇదే సమయంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద న్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సమీప గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏ చెరువు కట్ట తెగుతుందోనని తీవ్ర ఆం దోళన చెందుతున్నారు. ఇటీవల కడప జిల్లాలో అన్న మయ్య ప్రాజెక్టు తెగిపోయి తీవ్ర నష్టం కలిగించిన విష యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అంతం త మాత్రంగా, గుంతలతో ఉన్న రోడ్లు కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని రోడ్లు వర్షపు నీరు నిలిచినప్పుడు మడుగులను తలపిస్తున్నాయి.  గోతులు పడ్డ రోడ్లపై తట్టెడు మట్టో, ఓ గంప కంకరో వేసే నాథుడే కనిపించటం లేదు. దీంతో ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే ఆర్‌అండ్‌బీ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నా రోడ్ల తీరు బాగు పడలేదు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాకు వస్తున్న జిల్లా ఇనచార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ అయినా జిల్లాలో సమస్యలు తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


 రెండున్నరేళ్లలో అభివృద్ది ఏదీ..?

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరే ళ్లయింది. ఇప్పటికీ జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి పనీ... జరగ లేదు. ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేదు. నిరుద్యోగ సమ స్య రోజురోజుకు పెరిగిపోతోంది. వ్యవసాయమూ భారం గా మారుతున్న పరిస్థితుల్లో కుటుంబం గడవడమే కష్ట మైన ఈ రోజుల్లో ఏదో ఒక పని చేసుకొని బతుకుదామ న్నా  పరిస్థితులు ప్రభుత్వం  కల్పించడం లేదు. అనంత పురం నగర సమీపంలో జాకీ పరిశ్రమ వస్తోందని ఎంతో ఆశపడ్డారు. అధికార పార్టీ నేతల ధనదాహానికి ఆ పరిశ్ర మ కాస్తా జిల్లాను వదిలివెళ్లింది. ప్రభుత్వమేమో... సం క్షేమ పథకాల పేరుతో ఆయా సామాజికవర్గాలకు ఎంతో కొంత నగదు ఇచ్చి చేతులు దులుపుకొంటోంది. ఆ సొ మ్ముతో ఏడాదంతా బతికేందుకు వీలవుతుందా అనేది ప్రభుత్వమే ఆలోచించాలి. పని కల్పిస్తేనే కడుపు నిండేది.  పని కల్పించకపోవడంతో ఇతర పట్టణాలకు వలస వెళ్లి జీవించాల్సిన దుస్థితిని నిరుద్యోగ యువత ఎదు ర్కొంటోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందుగానే వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు నెలకొల్పుతామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆచరణలోకి నోచుకోలేదు. ఈ జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపాటి చిత్తశుద్ధి చూపుతున్నారో పాలకులుగా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. 


వరదలు, వర్షాలతో ఇబ్బందుల్లో ఉన్నా.. రారెందుకు..?

వారం రోజులుగా జిల్లాను వర్షాలు, వరదలు ముంచె త్తుతున్నాయి. మూగజీవాలతో పాటు ప్రజల ప్రాణాలూ అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పంటలన్నీ... ము నిగిపోయాయి. మీరెట్లా ఉన్నారని పాలక పార్టీ ప్రజా ప్రతినిధులుగానీ... అధికారులుగానీ... తక్షణం స్పందించిన పరిస్థితులు లేవు. వర్షం, వరదలు కుదుటపడిన తరువాత వస్తున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరిచ్చే భరో సా  ఇదేనా..? అధికారులు క్షేత్రస్థాయిలో నష్టపోయిన పం టలను పరిశీలించిన దాఖలాలు లేనప్పటికీ... వారి అంచ నా మేరకే జిల్లా వ్యాప్తంగా 1,16,215 లక్షల ఎకరాల్లో వేరు శనగ దగ్గర నుంచి మిగిలిన అన్ని రకాల పంటలు దెబ్బ తిన్నాయి. అధికారుల అంచనా నష్టమే రూ. 170 కోట్లు ఉంది. అదే విధంగా 528 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రూ. 6 కోట్ల వరకూ నష్టం జరిగింది. అనధికారికంగా నష్టం ఇంతకు రెండింతలుగానే ఉంది. ఈ రైతుల గోడును ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోలేదు. రైతుల పరిస్థితి ఇలా ఉండగా వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారు. సర్వం కోల్పోయి శిబిరాల్లో ఉన్నా... భోజ నం, తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన దుస్థితిని ఎదు ర్కొనాల్సి వచ్చింది. వారం రోజుల తరువాత అధికారులు వస్తే... ఏమని చెప్పుకోవాలి..? 


రోడ్ల మంత్రి ఇలాఖాలో రోడ్లన్నీ గుంతలే...

రోడ్ల మంత్రే జిల్లాలో ఉన్నా రోడ్లన్నీ గుంతలే. వాటిపై ప్రయాణమంటేనే నరకంగా ఉంది. ముఖ్యమంత్రేమో... రోడ్లపైన గుంతలన్నీ పూడ్చండని చెప్పారు. తూతూ మంత్రంగా మట్టితో కొన్ని గుంతలు... కంకర, క్రషర్‌ పొడితో కొన్ని గుంతలు పూడ్చి చేతులు దులుపుకుంటున్నారు. అలా చినుకు రాలిందో లేదో... ఆ మట్టి, ఆ క్రషర్‌ పొడి కొట్టుకు పోవడంతో తిరిగి రోడ్లపై గుంతలు యథాతథంగా దర్శనమిస్తున్నాయి. ఇలా పట్టణాల్లోనే కాకుండా పల్లె ప్రజలు సైతం రోడ్లపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  ఇక పట్టణాల్లో డ్రైనేజీలు పొంగిపొ ర్లుతున్నాయి. కాలువల్లో పూడిక తీయకపోవడంతో వర్షం వస్తే ఆ మురుగు నీరంతా రోడ్లపైకి చేరి దుర్గంధం వెదజ ల్లుతోంది. ప్రజలు రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతుల కోసం రూ. 20 కోట్ల దాకా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. 


భయాందోళనలో ప్రజలు

జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలు, వరదలతో డ్యాములు, చెరువులన్నీ నిండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చెరువులకు మరమ్మతులు చేపట్టకపోవడంతో గండ్లు పడుతున్నా యి. హంద్రీనీవాకు సైతం గండ్లు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఇప్పటికే హిందూపురంలో చెరువుల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారంటే జిల్లా ప్రజానీకం ఎలా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తోందో అర్థమవుతంది. జిల్లాలో తాజా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో... జిల్లా ఇనచార్జ్‌ మంత్రి, రాష్ట్ర పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ శనివారం జిల్లా యంత్రాంగంతో సమావేశం కానున్నారు. వర్షాలు, వరదల బీభత్సం నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనంత ప్రజలకు  ఏ మేరకు భరోసా ఇవ్వనున్నారో మరికొన్ని గంటలు వేచి చూడాలి మరి..


నేడు ఇనచార్జ్‌ మంత్రి బొత్స జిల్లాకు రాక

అనంతపురం, నవంబరు26(ఆంధ్రజ్యోతి): జిల్లా ఇనచార్జ్‌ మంత్రి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8.30 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 10.30 గంటలకు అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు. 11 గంటలకు కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన అధికారుల సమావేశంలో  పాల్గొంటారు. జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాలపై అధికారులతో సమీక్షించనున్నా రు.  అనంతరం సాయం త్రం 4 గంటలకు తిరిగి బెంగళూరుకు బయల్దేరి వెళ్తారు. 



Updated Date - 2021-11-27T06:31:56+05:30 IST