విద్యార్థుల అస్వస్థతపై మంత్రి సురేష్ ఆరా

ABN , First Publish Date - 2022-03-12T02:35:47+05:30 IST

జిల్లాలోని నంద్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల

విద్యార్థుల అస్వస్థతపై మంత్రి సురేష్ ఆరా

కర్నూలు: జిల్లాలోని నంద్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి సురేష్ ఆరా తీశారు.  డీఈఓతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న ఆహార పదార్థాలను పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. అస్వస్థతకు గురైనవారికి వైద్యం అందించాలన్నారు. విద్యార్థులు సురక్షితంగా ఇళ్లకు వెళ్లేవరకూ అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సురేష్ ఆదేశించారు. 


కర్నూలు: జిల్లాలోని నంద్యాల విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్ జరిగిన సంగతి తెలిసిందే. మధ్యాహ్న భోజనం తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఫుడ్‌ పాయిజన్ జరుగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-03-12T02:35:47+05:30 IST