గవర్నర్ తన పరిమితులకు లోబడి మాట్లాడాలి: మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-04-09T23:20:09+05:30 IST

రాష్ట్ర గవర్నర్ పై మంత్రి తలసాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గవర్నర్ తన పరిమితులకు లోబడి మాట్లాడాలి: మంత్రి తలసాని

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ పై మంత్రి తలసాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ పరమైన హోదా ఉన్నారని...వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ అని... గవర్నర్ కు ఒక పరిధి ఉందని... ఆ పరిధిని భారత రాజ్యాంగం పెట్టిందన్నారు. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యత రాహిత్యం అవుతుందన్నారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదని... గతంలో గవర్నర్లను గౌరవించామని గవర్నర్ లను ఎలా గౌరవించాలో మాకు, ముఖ్యమంత్రి కి తెలుసునని తెలిపారు. గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని... ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు. ప్రధాని, హోంమంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవసరం లేదన్నారు. 


ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడలేనని తమకు పరిధిలు ఉంటాయని... హుందా తనంగా వ్యహరించారని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్ ను వాడుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్ష పార్టీలకు నోటికి బట్ట లేదని విమర్శించారు. వరి దాన్యం మీద పోరాటం చేస్తున్నామని... రైతులకు అవసరమైన విధంగా మాట్లాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షాలు ఉండడం దురదృష్టకరమన్నారు. దాన్యం ఎందుకు కొనరో భాజపా నాయకులు చెప్పాలని కోరారు. కేంద్ర మంత్రి నూకలు తినాలి అన్నడం బాద్యతరహితమన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా మన రాష్ట్రంలో ఉందని... వాళ్లు పాలించే రాష్ట్రాల్లో లేదని అందుకే వాళ్లకు ఈర్ష్య అన్నారు. వ్యవస్థలను పని చేయనివ్వాలి కానీ వ్యవస్థ పక్కదారి పట్టించవద్దని మంత్రి సూచించారు.

Updated Date - 2022-04-09T23:20:09+05:30 IST