మన బస్తీ మన బడి దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా:Talasani

ABN , First Publish Date - 2022-05-10T00:37:37+05:30 IST

మన బస్తీ-మనబడి దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అన్నారు.

మన బస్తీ మన బడి దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా:Talasani

హైదరాబాద్: మన బస్తీ-మనబడి దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అన్నారు. సోమవారం ముషీరాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో మన బస్తీ -మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులను స్థానిక MLA ముఠా గోపాల్(Muta gopal), MLC సురభి వాణి దేవి( surabhi vani devi)తో కలిసి ప్రారంభించారు. అనంతరం  పాఠశాల ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి తలసాని పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నదని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ యాదవ్ ను పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించాలని కోరగా, ప్రతిపాదనలను సిద్దం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.భారతదేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమమని అననారు.విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం కోసం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మన బస్తీ మన బడి దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబర్ పేట లోని పోలీస్ గ్రౌండ్ లోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను స్థానిక MLA కాలేరు వెంకటేష్(kaleru venkatesh) MLC సురభి వాణి దేవి, DEO రోహిణి, కార్పొరేటర్ విజయ్ కుమార్, BC కమీషన సభ్యులు కిషోర్ గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. 


Read more