దళితుల ఆర్ధికాభివృద్ధికే దళిత బంధు: మంత్రి Talasani

ABN , First Publish Date - 2022-06-08T21:08:03+05:30 IST

దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తెలిపారు.

దళితుల ఆర్ధికాభివృద్ధికే దళిత బంధు: మంత్రి Talasani

హైదరాబాద్: దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో 28 మంది దళితబంధు(dalita bandhu) లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ BR అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతికోసం ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. అభివృద్దిలో ఎంతో వెనుకబడిన దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) ఆలోచన అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబందు పతకాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ పథకంలో ఒకొక్క లబ్ధిదారుడికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.  ప్రభుత్వం అందించే నిధులతో మీకు అనుభవం ఉన్న రంగంలో పెట్టుబడులు పెట్టి లబ్దిపొందాలని సూచించారు. 


లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ పథకం క్రింద పొందిన వాహనాలను అమ్మాలని  ప్రయత్నిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న దళితులు అందరికి దశలవారిగా దళితబందు పథకం క్రింద ఆర్ధిక సహాయం  అందిస్తామని తెలిపారు. గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి KCR అన్ని వర్గాల అభ్యున్నతికోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కేంద్రం నుండి ఒక్క పైసా తీసుకురావడం చేతకాని స్థానిక BJP నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి BJP కార్పొరేటర్ లను డిల్లీ కి పిలిపించుకొని ఒట్టి చేతులతో తిరిగి పంపించారని,నగర అభివృద్ది కోసం నిధులు మంజూరు చేసి ఉంటే ప్రజలకు మీలు జరిగి ఉండేదని అన్నారు. 

Updated Date - 2022-06-08T21:08:03+05:30 IST