ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదు:Talasani

ABN , First Publish Date - 2022-06-22T22:26:11+05:30 IST

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదు:Talasani

హైదరాబాద్: ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. BJP నేతలు తమ వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారని విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడితన తలసాని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించారు.దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తున్నారని, మోడీ, అమిత్ షా లు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 


మధ్యప్రదేశ్ లో చేసిన విధంగానే మహారాష్ట్ర లో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వడం, బస్సులు ఏర్పాటు చేయడం అనుమానాలు కలిగిస్తోందని అన్నారు. మహారాష్ట్ర లోని ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రతోనే MLA లను ఒక చోట నుండి మరో చోటుకు తరలిస్తుందని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, బీజేపీ జీవిత కాలం అధికారంలో ఉండదనే విషయాన్ని BJP నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎప్పుడు అన్ని మనకు అనుకూలంగా ఉండవని, మహారాష్ట్ర పరిస్థితి బీజేపీకి కూడా వస్తుందని అన్నారు. 


BJP సమావేశాలు హైదరాబాదు లో నిర్వహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ హైదరాబాద్ అందాలు, రాష్ట్ర ప్రగతిని మోడీ,బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చి చూస్తారని, బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదు లో జరిగిన అభివృద్దిని చూసి నేర్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ దేశానికి అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే కేంద్రంలోని BJP ప్రభుత్వం హింసను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపధ్ కు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగితే BJP నేతలు ఇష్టమొచ్చిన విధంగా మాట్లాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-22T22:26:11+05:30 IST