మత్స్యకార సంఘాల ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ

ABN , First Publish Date - 2022-03-17T20:51:02+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని పశువంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

మత్స్యకార సంఘాల ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని పశువంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మత్స్యకారుల  ప్రతినిధులతో సమావేవేశమయ్యారు. ఈ సమావేశంలో బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మేల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పలు జిల్లాలకు చెందిన గంగపుత్ర, ముదిరాజ్, ఇతర మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని పేర్కొన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు కనీస గుర్తింపు లేదన్నారు. 


ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో భారీగా మత్స్యసంపద సృష్టించాలన్నారు. దానిని పేదలకు పంచాలి అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని మత్రి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 వేల చెరువులు ఉండేవి. కానీ నేడు 23 వేల కు పెరిగాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అర్హులైన ప్రతి మత్స్య కారుడు ప్రభుత్వ లబ్ది పొందేలా సొసైటీలో సభ్యత్వం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని వెల్లడించారు. 

Updated Date - 2022-03-17T20:51:02+05:30 IST