బడుగు వర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తున్నది కేసీఆర్: తలసాని

ABN , First Publish Date - 2022-03-19T20:13:22+05:30 IST

బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఆఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

బడుగు వర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తున్నది కేసీఆర్: తలసాని

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఆఘనత  ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కి నూతనంగా చైర్మన్ గా నియమితులైన సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజకీయంగా కూడా అధిక ప్రాధాన్యత కల్పించేలా చట్టసభల్లో, నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీలలో గతంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా ఎంతో ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సుందర్ రాజ్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-03-19T20:13:22+05:30 IST