నగరంలో నాలాల పూడిక తొలగింపు ఫిర్యాదుల స్వీకరణకు వాట్సప్ గ్రూప్

ABN , First Publish Date - 2021-06-13T19:43:19+05:30 IST

జంటనగరాల లోని నాలా లలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా 9848021665 నెంబర్ తో వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నగరంలో నాలాల పూడిక తొలగింపు ఫిర్యాదుల  స్వీకరణకు వాట్సప్ గ్రూప్

హైదరాబాద్: జంటనగరాల లోని నాలా లలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా 9848021665 నెంబర్ తో వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీహెచ్ఎంసి పరిధిలోని నాలాలలో పూడిక తొలగింపు పనుల కోసం ప్రభుత్వం45 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. పూడిక తొలగింపు పనుల పురోగతి పై  ఈ నెల11 వ తేదీన అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం లో వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో నాలా లను సందర్శించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారని పేర్కొన్నారు. 


నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు, జంక్షన్ ల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాలాలలో పూడిక తొలగింపు పనులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈ నెల 14 నుండి 19 వ తేదీ వరకు ఎంఎల్ఏ లు, ఎంఎల్సీ లు, కార్పొరేటర్ లు సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో  నాలా లను సందర్శించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించినట్లు వివరించారు. 14 వ తేదీ సోమవారం  ఉదయం10 గంటలకు తాను అధికారులతో కలిసి బేగంపేట నాలా ను సందర్శించనున్నట్లు ప్రకటించారు. నాలా ల పూడిక తొలగింపు కు సంబంధించిన ఫిర్యాదులను ఫోటోలు, నాలా ప్రాంతం పేరు, సంబంధిత వ్యక్తి సమాచారం వాట్సప్ గ్రూప్ కు పంపించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు. నేరుగా పిర్యాదు చేయదలచిన వారు నెంబర్ 9848282309 కు చేయాలని మంత్రి సూచించారు.

Updated Date - 2021-06-13T19:43:19+05:30 IST