అవాస్తవం అని తేలితే రాజీనామా చేస్తా: తలసాని

ABN , First Publish Date - 2021-02-28T15:12:18+05:30 IST

రాష్ట్రంలో లక్షా ముఫ్పై రెండు వేల తొమ్మిది వందల తొంబ్బై ఉద్యోగాలు కల్పించామని

అవాస్తవం అని తేలితే రాజీనామా చేస్తా: తలసాని

హైదరాబాద్/ముషీరాబాద్ ‌: రాష్ట్రంలో లక్షా ముఫ్పై రెండు వేల తొమ్మిది వందల తొంబ్బై ఉద్యోగాలు కల్పించామని, ఇది అవాస్తవం అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఉద్యోగాల కల్పన నిజమని తేలితే ప్రతిపక్ష పార్టీల నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని మంత్రి తలసాని శ్రీనివా‌స్‌యాదవ్‌  సవాల్‌ విసిరారు. శనివారం ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణిదేవి ప్రచారంలో భాగంగా హెరిటేజ్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అధ్యక్షతన జరిగింది.


దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై అంబర్‌పేట నియోజకవర్గం కార్యాచరణ సమావేశం శనివారం అంబర్‌పేట క్రౌన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌,  కార్పొరేటర్లు విజయకుమార్‌గౌడ్‌, డి.లావణ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు తలసాని సాయికిరణ్‌యాదవ్‌, మాజీ కార్పొరేటర్లు పులి జగన్‌, కె.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T15:12:18+05:30 IST