బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై Talasani సమీక్ష

ABN , First Publish Date - 2022-07-01T18:21:43+05:30 IST

ఈ నెల 24న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని(Minister Talasani) సమీక్ష నిర్వహించారు.

బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై Talasani సమీక్ష

Hyderabad : ఈ నెల 24న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని(Minister Talasani) సమీక్ష నిర్వహించారు. సాలార్జింగ్ మ్యూజియం(Salarjung Museum)లో పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓల్డ్ సిటీ(Old City) బోనాల కోసం రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. బోనాల పండగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా బోనాల ఉత్సవాల నిర్వహణకు తలసాని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, గొప్పగా పండుగలు జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి అభిమతమని తలసాని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-01T18:21:43+05:30 IST