దిష్టిబొమ్మను దహనం చేస్తున్న గంగపుత్ర సంఘం నాయకులు
ఆదిలాబాద్ టౌన్, జనవరి 16: గంగపుత్రులను కించపరిచే విధం గా వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ తీరును ఖండిస్తూ శనివారం జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మ ను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా మంత్రి తలసాని దిష్టిబొమ్మతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మంత్రి తీరును ఖండిస్తూ వ్యవతిరేక నినాదాలు చేశారు. కాగా దిష్టిబొమ్మ దహనంను అడ్డుకున్న పోలీసులను వారించిన సభ్యులు ఎట్టకేలకు మంత్రి తలసాని దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. గంగపుత్రులను కించపరిచే విధంగా మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ మాట్లాడడం విడ్డూరమని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఇందు లో గంగపుత్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.