Hyd: కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి: Minister Talasani

ABN , First Publish Date - 2022-07-04T16:15:51+05:30 IST

తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.

Hyd: కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి: Minister Talasani

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)కు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని (Talasani) డిమాండ్ చేశారు. నిన్న ప్రధాని మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టెంపుల్స్ గురించి మాట్లాడారని, దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిగ్దం కొనసాగుతోందన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్‌తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌లో ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతోందని ప్రశ్నించారు. తాము చేసిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతుందా? అని నిలదీశారు. ‘నిన్న బీజేపీ సభకు మా బల్కంపేట టెంపుల్‌కు వచ్చిన మంది కూడా రాలేదు’ అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి మోదీ ఒక్క సమాధానం ఇవ్వలేదన్నారు. టెక్ట్స్ టైల్ పార్క్ అన్నారు.. ఇచ్చారా?.. కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. దేశం నుంచి బీజేపీ ప్రభుత్వం పోవాలన్నారు. మూడేళ్లనుంచి ఇక్కడే ఉన్న కిషన్‌‌రెడ్డి సికింద్రాబాద్ ఎన్ని సార్లు వచ్చారు?.. అభివృద్ధి చేశారా? అని నిలదీశారు. ఇక్కడ శాంతి భద్రతలు లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అని అన్నారు. చిల్లర రాజకీయాలు తాము చేయమని, ప్రధాని మోదీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-04T16:15:51+05:30 IST