రిజర్వాయర్ల వద్ద చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు: Talasani

ABN , First Publish Date - 2022-06-27T23:10:42+05:30 IST

రాష్ట్రంలోని పలు రిజర్వాయర్ ల వద్ద మత్స్య శాఖ(fisheries dept) ఆధ్వర్యంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (srinivas yadav) అధికారులను ఆదేశించారు.

రిజర్వాయర్ల వద్ద చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు: Talasani

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు రిజర్వాయర్ ల వద్ద మత్స్య శాఖ(fisheries dept) ఆధ్వర్యంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (srinivas yadav) అధికారులను ఆదేశించారు. సోమవారం  మత్స్య భవన్ లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుపై షీప్ ఫెడరేషన్ చైర్మన్ బాల రాజ్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. 


రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన వివిధ సాగునీటి ప్రాజెక్ట్ ల వద్ద మత్స్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అనువుగా ఉండే 159 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని, అందులో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.మత్స్య కళాశాల ద్వారా ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు ఈ ప్రాజెక్ట్ లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉన్న అవకాశాలతో కూడా ఒక నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన చేపపిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే అంశంపై దృష్టి సారించాలని అన్నారు.  


అందులో భాగంగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్, హనుమకొండ జిల్లాలోని బీమారం, నిర్మల్ జిల్లాలోని కడెం, సంగారెడ్డి జిల్లాలోని మంజీర, ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు PPP పద్దతిలో కేటాయించడానికి ఉన్న అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 26,778 నీటి వనరులలో  88.52 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 



రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, MLA, MLC లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం ద్వారా వారిని భాగస్వాములను చేయాలని ఆదేశించారు. చనిపోయిన గొర్రెల కు వెంటవెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమలు జరిగేలా చూడాలని, చనిపోయిన గొర్రెల స్థానంలో గొర్రెలను కొనుగోలు చేసే లబ్దిదారుడికి ఇచ్చే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పలు జిల్లాలలో గొర్రెల మార్కెట్ ల ఏర్పాటు కోసం భూమి కేటాయింపు, నిధుల మంజూరు జరిగినా పనులు జరగడం లేదని, వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి  పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, MLA, MLC లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం ద్వారా వారిని భాగస్వాములను చేయాలని ఆదేశించారు. చనిపోయిన గొర్రెల కు వెంటవెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమలు జరిగేలా చూడాలని, చనిపోయిన గొర్రెల స్థానంలో గొర్రెలను కొనుగోలు చేసే లబ్దిదారుడికి ఇచ్చే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పలు జిల్లాలలో గొర్రెల మార్కెట్ ల ఏర్పాటు కోసం భూమి కేటాయింపు, నిధుల మంజూరు జరిగినా పనులు జరగడం లేదని, వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


Updated Date - 2022-06-27T23:10:42+05:30 IST