మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు: మంత్రి Talasani

ABN , First Publish Date - 2022-07-08T19:57:56+05:30 IST

ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు: మంత్రి Talasani

హైదరాబాద్: ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) తెలిపారు. ఈ నెల 17న జరిగే సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (Bonalu) ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్, సికింద్రాబాద్‌కే పరిమితమైన బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా బోనాల ఉత్సవాల నిర్వహణ జరుగుతోందని తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు.  బోనాల ఉత్సవాలకు గతంలో కంటే అత్యధిక సంఖ్యలో భక్తులు రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. 17న మహంకాళీ అమ్మవారి బోనాలు జరుగనుండగా... 18న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగనుంది. 

Updated Date - 2022-07-08T19:57:56+05:30 IST